Share News

నంబర్‌ వన్‌ నానాజీ

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:56 AM

‘ఒకటే జననం.. ఒకటే మరణం.. ఒకటే గమనం.. ఒకటే గమ్యం.. గెలుపు పొందు వరకూ అలుపులేదు మనకు..’ అన్నాడో సినీ కవి. అక్షరాలా అదే కసితో చదివి కానిస్టేబుల్‌ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమంలో నిలిచాడు అచ్యుతాపురం మండలం దొప్పెర్లకు చెందిన గండి నానాజీ. పేదింట పుట్టిన ఈ విద్యా కుసుమం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అత్యుత్తమ ఫలితాన్ని సాధించాడు.

నంబర్‌ వన్‌ నానాజీ
నానాజీ

- కానిస్టేబుల్‌ పరీక్షల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం

- మెరిసిన పేదింటి రత్నం

- తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు

- సోదరుడు ఎలక్ట్రీషియన్‌

- వారి కష్టంతో కసిగా చదివి అత్యుత్తమ ఫలితం

- ఎస్‌ఐ పరీక్షతో పాటు గ్రూప్‌-1కు సన్నద్ధం

అచ్యుతాపురం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ‘ఒకటే జననం.. ఒకటే మరణం.. ఒకటే గమనం.. ఒకటే గమ్యం.. గెలుపు పొందు వరకూ అలుపులేదు మనకు..’ అన్నాడో సినీ కవి. అక్షరాలా అదే కసితో చదివి కానిస్టేబుల్‌ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమంలో నిలిచాడు అచ్యుతాపురం మండలం దొప్పెర్లకు చెందిన గండి నానాజీ. పేదింట పుట్టిన ఈ విద్యా కుసుమం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అత్యుత్తమ ఫలితాన్ని సాధించాడు.

మండలంలోని దొప్పెర్ల గ్రామానికి చెందిన అయ్యబాబు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయ కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివించారు. పెద్ద కుమారుడు ఎలక్ర్టీషియన్‌గా చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచాడు. రెండవ కుమారుడు నానాజీ చిన్నప్పటి నుంచి చదువులో ముంద ంజలో ఉండేవాడు. దీంతో నానాజీని బాగా చదివించాలని తల్లిదండ్రులు ఎక్కువగా కష్టపడే వారు. వ్యవసాయ కూలి పనులు సంవత్సరంలో కొంతకాలం మాత్రమే ఉంటాయి. మిగతా సమయాల్లో తండ్రి మేకలు కాసి వచ్చిన ఆదాయంతో గడిపేవారు. నానాజీ ఏడవ తరగతి వరకు దొప్పెర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివాడు. పదవ తరగతి వరకు పరవాడ జెడ్‌పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. డిప్లొమా ఆనందపురంలోని ప్రైవేటు కళాశాలలో పూర్తిచేశాడు. బీటెక్‌ దువ్వాడలో 2020లో పూర్తి చేశాడు. తరువాత ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలని శిక్షణ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపిక కాలేదు. అయితే ఈసారి కానిస్టేబుల్‌ పరీక్షల్లో 200లకు 168 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించాడు. తాము పడిన కష్టానికి నానాజీ న్యాయం చేశాడని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడికి చదువుపైనే ధ్యాస అని, రేయింబవళ్లు కష్టపడి చదివాడని వారు తెలిపారు. కాగా ఈసారి ఎస్‌ఐ పరీక్ష రాస్తానని, అలాగే గ్రూప్‌-1కు కూడా ప్రిపేర్‌ అవుతున్నానని నానాజీ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాడు.

Updated Date - Aug 03 , 2025 | 12:56 AM