డీసీఎంఎస్ చైర్మన్‌గా కోట్ని బాలాజీ
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:28 AM
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్‌గా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీకి అందిస్తున్న సేవలకు దక్కిన ప్రతిఫలం
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్‌గా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి మండలం బవులవాడ గ్రామానికి చెందిన బాలాజీ చాలా ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. 2013లో తెలుగునాడు విద్యార్థి సంఘం (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. అదే ఏడాది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో జేఏసీ తరపున పోరాటం చేశారు. టీడీపీ భీమిలి నియోజకవర్గ పరిశీలకునిగా, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధిగా సేవలు అందించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. పార్టీకి ఆయన అందించిన సేవలకుగాను ప్రభుత్వం డీసీఎంఎస్ చైర్మన్‌గా నియమించింది.