Share News

International Yoga Day 2025: ఘనంగా ప్రారంభమైన యోగా డే..

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:49 AM

విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. లక్షలాది మంది సాగర తీరానికి చేరుకుని యోగాసనాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

International Yoga Day 2025: ఘనంగా ప్రారంభమైన యోగా డే..
International Yoga Day 2025

విశాఖ: విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day 2025) ప్రారంభమైంది. లక్షలాది మంది సాగర తీరానికి చేరుకుని యోగాసనాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ప్రపంచ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా యోగా కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NHRC: కుప్పం ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

Srisailam: శ్రీశైలం శాసనంలో హేలీ తోకచుక్క ప్రస్తావన

Updated Date - Jun 21 , 2025 | 07:01 AM