Share News

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:37 PM

Weather News updates: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత అవకాశం ఉందని తెలిపింది. 40 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వేడి , ఉక్కపోత ప్రభావం ఉంటుందని తెలిపింది.

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం
Weather News updates

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు చోట్ల 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మిట్ట మధ్యాహ్నం బయట తిరగాలంటే ఆలోచించాల్సి పరిస్థితి ఏర్పడింది. రాత్రిళ్లు వర్షం పడే సూచనలు కనిపించినా.. పగలు మాత్రం ఎండలు మండిపోతున్నాయి. వారంలో కనీసం ఒకసారైనా వర్షం పడుతోంది. అకాల వర్షాల కారణంగా రైతులు అల్లాడిపోతున్నారు. వర్షం పడ్డ మరుసటి రోజు నుంచి వాతావరణం పొడిగా మారుతోంది. ఎండలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.


ఈ మేరకు సోమవారం విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలలో పోడి వాతవరణం కోనసాగుతుందన్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే, రెండు మూడు డీగ్రీలు ఎక్కువుగా నమోదయ్యే ఆవకాశం ఉందని అన్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఆవకాశం ఉందని కూడా అన్నారు. ఉష్ణోగ్రతలు, కనిష్టంగా 28 డిగ్రీలు, గరిష్టంగా 40 డిగ్రీల మధ్య నమోదయ్యే ఆవకాశం ఉందని వెల్లడించారు. వేడి, ఉక్కపోతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.


అల్లాడిస్తున్న అకాల వర్షాలు

ఎండకాలం అన్నమాటే కానీ, మధ్య మధ్యలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు కోతలకు వచ్చిన సమయంలో వర్షాలు పడటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కారణంగా అయ్యవారిపల్లి, వెలుగొమ్మల గ్రామాల్లో 300 ఎకరాల వరి పంటనష్టం సంభవించింది. 412 మంది అన్నదాతలు నష్టాలపాలయ్యారు. ఆ గ్రామాల్లోనే 8 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 8 ఎకరాల్లో మామిడి తోట దెబ్బతింది. పంటలు చేతికి వచ్చే సమయంలో ఇలా జరగటంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Pop Francis: ఇంకొన్ని నెలల్లో భారత్ పర్యటన.. ఇంతలోనే పోప్ మరణం..

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Updated Date - Apr 21 , 2025 | 03:37 PM