Vijayawada Court: వంశీకి మరో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:58 AM
భూకబ్జా కేసులో వంశీకి ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది.టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 23వరకు పొడిగించారు.

భూకబ్జా కేసులో ముందస్తు బెయిల్‌కు నో
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రిమాండ్ పొడిగింపు
విజయవాడ, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు న్యాయస్థానాల్లో వరుస షాకులు తగులుతున్నాయి. గన్నవరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో భూమిని కబ్జా చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి విజయవాడలోని 12వ అదనపు జ్యుడీషియల్ కోర్టు నిరాకరించింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీతో పాటు పదిమంది నిందితులకు 23వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు.
వంశీ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయండి
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రెండోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయాధికారి హిమబిందు 11కు వాయిదా వేశారు.
Read Latest AP News And Telugu News