TTD Medical Services: వైద్య సిబ్బందికి అపూర్వ అవకాశం, త్వరలో టీటీడీ శ్రీవారి వైద్యసేవ
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:31 PM
తిరుమల శ్రీవారి వైద్య సేవలు ఇక నుంచి మరింత విస్తరించబోతున్నాయి. దేవస్థాన పరిధిలోని అన్ని హాస్పిటల్స్‌లో వాలంటర్ల మాదిరి డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి కూడా అవకాశం ఇవ్వనున్నారు.
తిరుమల, సెప్టెంబర్ 1: తిరుమల శ్రీవారి వైద్య సేవలు ఇక నుంచి మరింత విస్తరించబోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని హాస్పిటల్స్‌లో శ్రీవారి వైద్యసేవను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం శ్రీవారి సేవలకు వాలంటర్లకు అవకాశం కల్పిస్తున్న తరహాలోనే డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అవసరమైతే ఇందుకోసం శిక్షణ ఇచ్చి మరీ వారి సేవలు వినియోగించుకోవాలని చూస్తున్నారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. దేవస్థానం అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.
శ్రీవారి వైద్య సేవలకు అవసరమైన ప్రత్యేక సెల్, విధివిధానాలు రూపొందించాలని సింఘాల్ ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యంగా అశ్విని, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో వాలంటరీ వైద్యుల సేవలు వినియోగించుకోవాలని ఆయా విభాగాల డైరెక్టర్లకు ఈవో సూచించారు.
అటు, ఎస్వీ గోసంరక్షణశాలలో గోసేవకు వీలుగానూ చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, కన్యాకుమారి, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి గోసేవను ప్రారంభించాలని, ఇందుకు అవసరమైన శిక్షణను కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News