TTD Clarity: టీటీడీలో సిఫార్సు లెటర్స్ రద్దు విషయంపై క్లారిటీ..
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:00 PM
తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనం కోసం సిఫార్సు లెటర్స్ మే 1 నుండి జూన్ 30 వరకు రద్దు అని వస్తున్న వార్తలపై టీటీడీ పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

కాకినాడ : తిరుమల తిరుపతి ఆలయంలో ప్రతిరోజూ దాదాపు 3000 VIP బ్రేక్ దర్శనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, స్వామి వారి దర్శనం కోసం సిఫార్సు లెటర్స్ మే 1 నుండి జూన్ 30 వరకు రద్దు అని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ విషయంపై స్పందించారు. VIP బ్రేక్ దర్శనాలు రద్దు అని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.
తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనం కోసం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫార్సు లెటర్స్ రద్దుపై టీటీడీ పాలకమండలి ఎటువంటి తీర్మానం చేయలేదని స్పష్టం చేశారు. సిఫార్సు లెటర్స్ పై దర్శనాలు యధాతధంగా కొనసాగుతాయని వివరించారు. అయితే, వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) VIP బ్రేక్ దర్శనాలను తగ్గించడానికి, సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించడానికి ఎక్కువ స్థలాన్ని కేటాయించడానికి చర్యలు తీసుకుంటోన్నట్లు తెలుస్తోంది.
Also Read:
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..