AP Crime News: అల్లుడిని కిడ్నాప్ చేసిన అత్త.. కారణమేంటో తెలిస్తే..
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:49 PM
గుంటూరు జిల్లాలోని తెనాలిలో అల్లుడిని స్వయంగా అత్తే కిడ్నాప్ చేయించడం కలకలం రేపింది. కూతురు, అల్లుడు తన ఇంటికి రావడం లేదనే కోపంతో అత్త కిడ్నాప్‌నకు పాల్పడింది. నలుగురు యువకులతో కలిసి అల్లుడిని కిడ్నాప్ చేసింది.
గుంటూరు జిల్లాలోని తెనాలిలో అల్లుడిని స్వయంగా అత్తే కిడ్నాప్ చేయించడం కలకలం రేపింది. కూతురు, అల్లుడు తన ఇంటికి రావడం లేదనే కోపంతో అత్త కిడ్నాప్‌నకు పాల్పడింది. నలుగురు యువకులతో కలిసి అల్లుడిని కిడ్నాప్ చేసింది. పోలీసులు వెంటనే స్పందించడంతో నిందితులు పట్టుబడ్డారు. తెనాలికి చెందిన మణికంఠ అనే యువకుడు రెండేళ్ల క్రితం వినుకొండకు చెందిన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు (Tenali kidnapping news).
ఆ ప్రేమ వివాహం యువతి తల్లి విజయలక్ష్మికి ఇష్టం లేదు. రెండేళ్లుగా మణికంఠ, అతడి భార్య విడిగానే ఉంటున్నారు. పలుమార్లు ఇంటికి రావాలని పిలిచినా కూతురు, అల్లుడు అంగీకరించలేదు. విజయలక్ష్మి మీద అనుమానంతోనే వారు అత్తింటికి వెళ్లలేదు. ఈ క్రమంలో శనివారం విజయలక్ష్మి నలుగురు వ్యక్తులను తీసుకుని అల్లుడి ఇంటికి వెళ్లింది. మణికంఠపై దాడికి పాల్పడి అతడిని అందరూ కలిసి కిడ్నాప్ చేశారు (bizarre crime Tenali).
మణికంఠ స్నేహితుడు ఈ విషయాన్ని త్రీ టౌన్ ఎస్సై కరీముల్లాకు ఫోన్ చేసి చెప్పాడు (Tenali crime update). వెంటనే స్పందించిన ఎస్సై మరో కానిస్టేబుల్‌తో కలిసి గాలింపు చేపట్టారు. కారును వెంబడించారు. చివరకు చేబ్రోలు మండలం చేకూరు వద్ద కారును అడ్డగించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News