TGS High Court: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:10 PM
నిర్ణీత సమయంలో స్పందించకుంటే జరిమానా విధిస్తామని తెలంగాణ ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్ అయింది. చాలా కేసుల్లో గడువులోపు.. కౌంటర్ ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది.
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. చాలా కేసుల్లో నిర్దేశిత గడువులోపు.. కౌంటర్ దాఖలు చేయడం లేదని ప్రభుత్వంపై మండిపడింది. వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్ కేసు విచారణ సందర్భంలో తెలంగాణ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేసిన హైకోర్టు.. డిసెంబర్ 12లోపు కౌంటర్ దాఖలు చేయకుంటే.. ప్రభుత్వానికి జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది.
ఇవీ చదవండి:
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి