Palla Srinivas Rao: ఈ వేడుకలు కేడర్ ఐక్యత, ఉత్సాహానికి ప్రతీక: పల్లా
ABN , Publish Date - Nov 10 , 2025 | 10:06 PM
టీడీపీ ముఖ్య నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ, ప్రజలకు సేవ చేయాలన్న నిబద్ధతతో ప్రమాణస్వీకారం చేయాలని చెప్పారు.
అమరావతి, నవంబర్ 10: రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు అన్నారు. టీడీపీ ముఖ్య నేతలతో సోమవారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ, ప్రజలకు సేవ చేయాలన్న నిబద్ధతతో ప్రమాణస్వీకారం చేయాలన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, సన్మానాలు, గ్రూప్ ఫోటోలు, హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తప్పక హాజరై, కొత్త కమిటీ సభ్యులను ప్రోత్సహించాలన్నారు. ప్రతి ఒక్కరూ వేడుకల ఫోటోలు, వీడియోలను తమ సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ మరింత బలపడుతోందన్నారు. ఈ వేడుకలు కేడర్ ఐక్యత, ఉత్సాహానికి ప్రతీక అని పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు తప్పనిసరిగా పాల్గొని మహానేతకు నివాళి అర్పించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ పేలుడుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు.. అమిత్‌షా
Mother attacked on Son: ఏపీలో దారుణ హత్య.. తల్లే హత్య చేయించింది!