Share News

75th anniversary : సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా..

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:48 AM

sikkolu 75th anniversary celebrations శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన ఈ నెల 13 నుంచి 15వరకు వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

75th anniversary : సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా..
మాట్లాడుతున్న డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు

  • ప్రతిష్టాత్మకంగా జిల్లా 75 వసంతాల వేడుకలు

  • జిల్లా రెవెన్యూ అధికారి వేంకటేశ్వరరావు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన ఈ నెల 13 నుంచి 15వరకు వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ‘జిల్లా సంస్కృతి, చరిత్ర పురోగతిని ప్రతిబింబించేలా ప్రతీ కార్యక్రమాన్ని రూపొందించాలి. ప్రజలంతా పాల్గొనేలా ఉత్సవాలు నిర్వహించాల’ని తెలిపారు. కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

  • ఈ నెల 13న ఉదయం 10 గంటలకు మునిసిపల్‌ హైస్కూల్‌ మైదానంలో వేడుకలు ప్రారంభమవుతాయి. 1950 నుంచి 2025 వరకు జిల్లాలో చోటుచేసుకున్న అభివృద్ధిని ఆవిష్కరించేలా సాంస్కృతిక ప్రదర్శనలు, నాయకుల ప్రసంగాలు చేపట్టాలి. సాయంత్రం 4 నుంచి 7.30 వరకు ఆర్ట్స్‌ కళాశాల రోడ్డు నుంచి ఏడురోడ్ల జంక్షన్‌ వరకు శోభాయాత్ర. ఆదివాసీ తెగల జానపద నృత్యాలు, సంగీతం, వారసత్వ కార్యక్రమాలు ప్రఽధాన ఆకర్షణగా ఉంటాయి. రాత్రి 6 నుంచి 10 వరకు ఫుడ్‌ స్టాల్స్‌, స్థానిక రుచులు, తెగల మిల్లెట్‌ ఫుడ్‌, తీరప్రాంత వంటకాలు లభిస్తాయి.

  • 14న ఉదయం 8 గంటల నుంచి సంప్రదాయ క్రీడల పోటీలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు. మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు థింసా వంటి జానపద నృత్యాలు, స్వాతంత్య్ర పోరాట ఇతివృత్తాల నాటకాలు. సాయంత్రం 6 గంటలకు ప్రముఖుల సత్కారం. రాత్రి 10 గంటల వరకు ప్రత్యక్ష వంటల ఫెస్టివల్‌, సాంస్కృతిక సంగీతం.

  • 15న ఉదయం 9 నుంచి 12-30 వరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరణ. దేశభక్తి గీతాలు. ముఖ్యమంత్రి ప్రతినిధి ప్రసంగం. డైమండ్‌ జూబ్లీ సందర్భంగా ప్రత్యేక పతాకావిష్కరణ ఉంటుందని డీఆర్వో తెలిపారు. నగరాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తామన్నారు. అరసవల్లి సూర్యదేవాలయం, రైల్వేస్టేషన్‌, జాతీయ రహదారి కూడళ్లను ఎల్‌ఈడీ లైట్లతో ముస్తాబు చేయనున్నామని తెలిపారు.

Updated Date - Aug 02 , 2025 | 12:48 AM