గంజాయితో ముగ్గురు పట్టివేత
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:51 PM
పలాస రైల్వేస్టేషన్‌లో తమిళనాడు రాష్ట్రం మధుర నార్త్‌బ్లాక్, వాగైకులం గ్రామానికి చెందిన జె.శ్రీధర్, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా మార్లాబా గ్రామానికి చెందిన శ్యాముల్‌కరాడ్, అదే రాష్ట్రం అంగూరు గ్రామానికి చెందిన రింకు బిరో రెండు బ్యాగుల్లో 8.800 కిలోల గంజాయి తరలిస్తుండగా రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు.

పలాస, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్‌లో తమిళనాడు రాష్ట్రం మధుర నార్త్‌బ్లాక్, వాగైకులం గ్రామానికి చెందిన జె.శ్రీధర్, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా మార్లాబా గ్రామానికి చెందిన శ్యాముల్‌కరాడ్, అదే రాష్ట్రం అంగూరు గ్రామానికి చెందిన రింకు బిరో రెండు బ్యాగుల్లో 8.800 కిలోల గంజాయి తరలిస్తుండగా రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. రైల్వే ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్ తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రాత్రి 10గంటల ఆ ము గ్గురూ గంజాయితో తమిళనాడు వెళ్లేందుకు టిక్కెట్లు తీసుకున్నారు. వీరిపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వేర్వేరు ప్రాంతాల్లో రైలుకోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న రైల్వే పోలీ సులు వారిని ప్రశ్నించడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు లు అప్రమత్తమైన వారిని పట్టుకున్నారు. వారి బ్యాగులు పరిశీలించగా గంజాయి బయట పడింది. మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి విశాఖ రైల్వేకోర్టులో హాజరు పరిచి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.