23 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:14 AM
ఒడిశా కు చెందిన ఇద్దరు మ హిళలు, మరో వ్యక్తి టెక్కలి రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వచ్చే ప్రాంతంలో 23 కిలోల గంజాయితో శనివారం పోలీసులకు శనివారం పట్టుబడ్డారు.

టెక్కలి, ఆగస్టు 2(ఆంఽధ్రజ్యోతి): ఒడిశా కు చెందిన ఇద్దరు మ హిళలు, మరో వ్యక్తి టెక్కలి రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వచ్చే ప్రాంతంలో 23 కిలోల గంజాయితో శనివారం పోలీసులకు శనివారం పట్టుబడ్డారు. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా పద్మాపూర్, తెంబగూడ, మిల్కాపం గ్రామాలకు చెందిన రచనాలిమా, ఆకాష్ హెంటా, పారాకుమారి బర్దన్ ముగ్గుర్ని అరెస్టు చేశారు. అలాగే గుణుపూర్ నుంచి గంజాయి ప్యాకెట్లను విశాఖ, హైదరాబాద్ ప్రాంతాలకు రైళ్లలో, బస్సుల్లో వీరు తరలిస్తుంటారని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఒడిశాలోని సుందరగూడకు చెందిన బిడగ రమేష్, మహారాష్ట్ర అకోలా జిల్లా హరిహరపేటకు చెందిన గోకుల్ చంద్రాకర్‌ను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.