సందడిగా అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:22 AM
అన్నదాత సుఖీభవ నిధులు పంపిణీ శనివారం జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగింది. ఈ సందర్భంగా నమూనా చెక్కులను రైతులకు అందజేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షలాది మంది రైతులకు లబ్ధిచేకూరనుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అన్నదాత సుఖీభవ నిధులు పంపిణీ శనివారం జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగింది. ఈ సందర్భంగా నమూనా చెక్కులను రైతులకు అందజేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షలాది మంది రైతులకు లబ్ధిచేకూరనుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం: అశోక్
కంచిలి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. కంచిలి మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ, పీఎంకిసాన్ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎస్.శశిభూషణ్, జనసేన ఇన్‌చార్జి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు, ఏడీఏ భవానీ శంకర్, ఉద్యానవనశాఖాధికారి మాధవీలత, ఇచ్ఛాపురం ఏఎంసీ చెర్మన్ బి.మణిచంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే శిరీష
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరిష అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పాతటెక్కలిలో శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 2,29,748 మంది రైతులకు రూ.19.81 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో పలాస ఆర్డీవో జి.వెంకటేష్, వసంతస్వామి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, ఏఎంసీ వైస్‌చైర్మన్ చంద్రకళ, మాజీ ఎంపీపీలు సూరాడ మోహనరావు, నాయకు లు దువ్వాడ హేంబాబుచౌదరి, వ్యవసాయ శాఖ ఏఈ ధనుంజ య తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం
నరసన్నపేట/ జలుమూరు/ పోలాకి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని, అయినా రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట మండలం కంబకాయి, జలుమూరు మండలం లింగాలవలస, పోలాకి మండలం మబుగాం గ్రామాల్లో అన్నదాత సుభీభవ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నియోజవర్గంలో 37,741 మంది రైతుల ఖాతాల్లో రూ.24.9 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కూటమి నాయకులు పాగోటి ఉమామహేశ్వరి, రోణంకి కృష్ణంనాయుడు, బైరి భాస్కరావు, తర్ర బలరాం, ఎంవీ నాయుడు, ఏడీఏ వెంకటమధు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్ సాగుకు దోహదం: జడ్పీ సీఈవో
పాతపట్నం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సాగునకు అన్నదాత సుఖీభవ ఆర్థికంగా ఎంతగానో దోహదపడుతుం దని జడ్పీ సీఈవో శ్రీధరరాజా అన్నారు. తామర గ్రామంలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సతీ మణి తామర గ్రామ సర్పంచ్ మామిడి సుధీష్ణ నమూనా చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీ రాజగోపాలరావు, మండలప్రత్యేకాధికారి మంచు కరుణాకర రావు, ఏవో పి.కిరణవాణి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
జెండాలో రైతు పనిముట్లను పెట్టుకున్న పార్టీ టీడీపీ: ఎమ్మెల్సీ వేపాడ
కోటబొమ్మాళి, ఆగస్టు 2(ఆంధ్ర జ్యోతి): రైతుల పనిముట్లను జెం డాలో పెట్టుకుని, రైతుల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, ఎండీవో ఫణీంద్రకుమార్, టెక్కలి ఏడీఏ జగన్మోహన్‌నావు, తహసీల్దార్ అప్పలరాజు, ఏవో గోవిందరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల కళ్లల్లో ఆనందమే లక్ష్యం: గ్రీష్మ
ఆమదాలవలస, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రైతన్నల కళ్లల్లో ఆనందం చూ డడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అన్నారు. శని వారం కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చి వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోం దన్నారు. డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరు కట్ల విశ్వప్రసాద్, నారాయణపురం ప్రాజెక్టు చైర్మన్ సనపల ఢిల్లీశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు నూకరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీత, టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి మొదలవలస రమేష్, ఎస్సీ కార్పొ రేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు, కేవీకే ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ కె.భాగ్యలక్ష్మి, వ్యవసాయాధికారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఆర్థిక భద్రత
కొత్తూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి) రైతులకు అన్నదాత సుఖీభవతో ఆర్థిక భద్రత దొరుకుతుం దని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట ర మణ అన్నారు. శనివారం మాతలలోని తన క్యాం పు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా డారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మరో హామీని కూటమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20వేలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమకానుందని, దీంతో రైతులకు ఆర్థికంగా సహా యపడుతుందని ప్రభుత్వం అందిస్తున్న సహాయా న్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం రైతు జీవితంలో ఒక సంతోష విత్తనంలా మారాలని ఆయన కోరారు. ఇవే కాకుండా చేనేత కార్మికులకు ఉచితంగా విద్యు త్ మీటర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో ప్రజలు అన్నివిధాలా సంతోషంగా జీవనం గడి పేందుకు కూటమి ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు.