మహిళల అభ్యున్నతే ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:01 AM
మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్యేల్యే ఎన్. ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్) అన్నారు.

జి.సిగడాం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్యేల్యే ఎన్. ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్) అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీసీ మహిళల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిల దొక్కుకునేలా ప్రభుత్వం చేయూత నిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు ఇంటి వద్దనే ఉంటూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. రైతు సేవా కేంద్రం సమీపంలో నిర్మించిన పశువుల నీటి తొట్టెను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కుమరాపు రవికుమార్, పైల విష్ణుమూర్తి, వజ్జిపర్తి రఘురాం, మజ్జి కన్నంనాయుడు, కూర్మారావు, ఈశ్వర రావు, సురేష్,న్వి(ేంపీడీవో జి.రామకృష్ణ, తహసీల్దారు ఎం.,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కుటుంబానికి సాయపడాలి
రణస్థలం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది.. కుటుంబానికి సాయపడాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. 90 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎం. ఈశ్వరరావు, కూటమి నేతలు లంక శ్యామలరావు, డీజీఎం ఆనందరావు, పిన్నింటి భానోజినాయుడు, దన్నాన మహేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మహిళలకు చేయూత
లావేరు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కుట్టు శిక్షణతో మహిళలకు చేయూతనిస్తున్నామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం లావేరు మండల కేంద్రంలో మహిళలకు కుట్టు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంబించారు. 103 కుట్టు మిషన్లును ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ప్రతి మహిళ అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ తోటయ్యదొర, ఏపీఎం సుబ్యయ్యనాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.