Share News

నిత్యం యోగాతో ఆరోగ్యం

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:59 PM

యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతిరోజు సుమారు 30 నిమషాలు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని కలె క్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

నిత్యం యోగాతో ఆరోగ్యం
యోగా సాధన చేస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులు

21న జిల్లా వ్యాప్తంగా నిర్వహణ

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతిరోజు సుమారు 30 నిమషాలు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని కలె క్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. స్థానిక 80 అడుగుల రోడ్డులో సుమా రు 2000 మందితో మాక్‌ యోగా శనివారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ప్రతి దినం ఎలా తీసుకుంటారో అదేవిధంగా యోగాను సాధన చేయా లన్నారు. ఈనెల 21న ప్రపంచయోగా దినోత్సవం సందర్భంగా విశాఖ కు ప్రధాని మోదీ వస్తున్నారని, అదేరోజు జిల్లా వ్యాప్తంగా సచివా లయ, మండల, జిల్లా స్థాయిల్లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు యోగ సాధనలో పాల్గొనని వారు యూ ట్యూబ్‌లో చూసి ప్రొటోకాల్‌ ప్రకారం యోగసాధన చేయాలని కోరారు. ఇకపై ప్రతీ దినం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్థానిక 80 అడుగుల రోడ్డులో యోగా, ఫిట్‌నెస్‌ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులు, సంస్థల ప్రతినిధులను కోరా రు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వేంక టేశ్వర రావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, ఆయుష్‌ వైద్యాధికారి జగదీష్‌, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, డీఎస్డీవో శ్రీధర్‌, స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ అధికారి సాయికుమార్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రతినిధులు వి. సుధారాణి, ఎన్‌.కల్పన, డి.సురేంద్ర, యోగా శిక్షకులు కొంక్యాన మురళి, గాయత్రి, తంగి స్వాతి, దుంపల చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:59 PM