Share News

సీహెచ్‌వోల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:02 AM

కమ్యూనిటీ హెల్త్‌ అధికారుల(సీహెచ్‌ఓ)ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్‌ సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే పార్కు వద్ద అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.

సీహెచ్‌వోల సమస్యలు పరిష్కరించండి
ధర్నా చేస్తున్న సీహెచ్‌ఓలు

  • ధర్నా చేస్తున్న సీహెచ్‌ఓలు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): కమ్యూనిటీ హెల్త్‌ అధికారుల(సీహెచ్‌ఓ)ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్‌ సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే పార్కు వద్ద అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఎం.ఉషారాణి మాట్లాడుతూ సిహెచ్‌ఓలుగా 6 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్‌ చేయాలని కోరారు. జాతీయ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన పెంపుదలను అమలు చేయాలని, ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నిర్దిష్టమైన జాబ్‌ ఛార్జు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌లను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సోమావరం నుంచి విధులను బషిష్కరిస్తు న్నామని తెలిపారు. కానీ ఎమర్జెన్సీ సేవల్లో మాత్రం అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.ఇందుమతి, ఉపాధ్యక్షులు డి.శ్రావణి, సీహెచ్‌ జ్యోతి, జిల్లా అడ్వైజర్‌ రాజీవ్‌, ఈసీ సభ్యుడు విశ్వనాథ్‌, జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మంది సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:02 AM