Share News

Democracy: ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:28 AM

SIT report on adulterated liquor is needed ‘పార్లమెంట్‌లోకి మీడియాను అను మతించకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. బీజేపీ నాయకులారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ అన్నారు. శ్రీకాకుళంలోని ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు.

Democracy: ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
మాట్లాడుతున్న కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌

  • కార్పొరేట్లకే రూ.కోట్లలో రుణమాఫీ

  • వైసీపీ పాలనలో కల్తీ మద్యంపై సిట్‌ నివేదిక కావాలి

  • కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌

  • అరసవల్లి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ‘పార్లమెంట్‌లోకి మీడియాను అను మతించకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. బీజేపీ నాయకులారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ అన్నారు. శ్రీకాకుళంలోని ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 11ఏళ్లలో రూ.14.5లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. అది కేవలం కార్పొరేట్ల కోసమే. వారేమీ పేదలు కాదు. అందులోనూ గుజరాత్‌కు చెందిన వారికే ఎక్కువ రుణమాఫీ చేశా రు. ఏయే రాష్ట్రానికి ఎంతెంత రుణమాఫీ చేశారో సీతారామన్‌ ప్రకటించాలి. ఇందులో 10శాతం కమీషన్‌ చేతులు మారిందనే విమర్శలు కూడా ఉన్నాయ’ని చింతా మోహన్‌ ఆరోపించారు. ‘వైసీపీ ఐదేళ్ల పాలన లో కల్తీ మద్యం తాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం స్కామ్‌కు సంబంధించి సిట్‌ విచారణ నివేదికను బహిర్గతం చేయాల’ని చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. అలాగే ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పేర్కొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:28 AM