Trainy IAS: అసిస్టెంట్ కలెక్టర్‌గా పృథ్వీరాజ్ కుమార్
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:26 PM
Assistant Collector జిల్లాకు కొత్త అసిస్టెంట్ కలెక్టర్‌గా దొనక పృథ్వీరాజ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2026 ఏప్రిల్ 24వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాకు కొత్త అసిస్టెంట్ కలెక్టర్‌గా దొనక పృథ్వీరాజ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2026 ఏప్రిల్ 24వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఈయన 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వయసు 23 సంవత్సరాలు. తండ్రి విజయకుమార్ ఎంఈవోగా పనిచేస్తుండగా, తల్లి వెంకటరత్నం గృహిణి. సోదరి పూజిత ఆంధ్రా యూనిరవర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పృథ్వీరాజ్ ప్రాథమిక విద్య 1- 10వ తరగతి వరకు పార్వతీపురంలో సాగింది. నారాయణ కాలేజీలో ఇంటర్ చదివారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇగ్నోలో పీజీ పూర్తి చేశారు. ప్రజలకు చేరువగా ఉంటూ సేవలందించడమే తన లక్ష్యమని పృథ్వీరాజ్‌కుమార్ తెలిపారు.