Share News

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:58 PM

అక్కవరం గ్రామానికి చెందిన నెయ్యిల జోగారావు(45) విశాఖ జిల్లా ఆనందపురం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు అతడి భార్య నీలవేణి ఆరోపిస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

టెక్కలి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): అక్కవరం గ్రామానికి చెందిన నెయ్యిల జోగారావు(45) విశాఖ జిల్లా ఆనందపురం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు అతడి భార్య నీలవేణి ఆరోపిస్తున్నారు. ఉపాధి కోసం ఆనందపురంలోని ఓ రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పనిచేసేందుకు వెళ్లిన తన భర్త శవమైవస్తాడని అనుకోలేదని ఆమె రోధిస్తుంది. రెండురోజుల కిందట నీ భర్త మద్యం తాగుతున్నాడని, పనికి కూడా రావడం లేదని, తీసుకుపోవాలని తనకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారని, తిరిగి 48గంటల్లో తన భర్త మృతదేహాన్ని ఇంటికి పంపారని నీలవేణి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై అనుమానం ఉందని ఆమె సోమవారం టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అయితే కొంతసేపు టెక్కలి పోలీసులు తడబాటుకు గురైనా చివరకు గ్రామస్థులు, మృతుడి భార్య ఒత్తిడి మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కాగా జోగారావుకి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:58 PM