వృద్ధురాలి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:59 PM
మందస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన నర్తు గున్నమ్మ(80) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

హరిపురం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): మందస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన నర్తు గున్నమ్మ(80) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకుమారుడి వద్ద ఉంటున్న గున్నమ్మ కొన్నాళ్లగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన గున్నమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగడం అపస్మారక స్థితికి వెళ్లింది. కుటుంబ సభ్యులు గమనించి గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడ్ని పిలిచించి చూపించగా.. అప్పటికే మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందగా కేసు నమోదు చేస్తామన్నారు.