Share News

ఎమ్మెల్సీ దువ్వాడకు నోటీసు

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:13 AM

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని వాస్‌కు నోటీసు జారీ చేసినట్లు ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ తెలిపారు.

ఎమ్మెల్సీ దువ్వాడకు నోటీసు
నోటీసు తీసుకుంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్‌

హిరమండలం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని వాస్‌కు నోటీసు జారీ చేసినట్లు ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్ని కలకు ముందు ఓ టీవీ చానల్‌ నిర్వహించి న ఇంటర్వ్యూలో దువ్వాడ మాట్లాడుతూ పవన్‌పై పలు విమర్శలు చేశారు. ప్రశ్నిం చడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద నెలకు రూ.50 కోట్లు తీసుకుని ఆయ న్ను ప్రశ్నించడం లేదని అప్పట్లో అన్నారు. దీనిపై ఈ ఏడాది మార్చి 8న చొర్లంగి జనసేన నాయకుడు వంజరాపు సింహాచలం హిరమండలం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దువ్వాడపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. టెక్కలిలోని దువ్వాడ కార్యాలయంలో ఆయనకు ఏఎస్‌ఐ చంద్రరావు శనివారం నోటీసు అందజేశారు

Updated Date - Aug 03 , 2025 | 12:13 AM