Share News

stell plant: వెయ్యి ఎకరాల్లో కల్యాణి స్టీల్స్‌

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:28 PM

Kalyani Steels సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పరిధిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. రూ.30వేల కోట్లతో వెయ్యి ఎకరాల్లో కల్యాణి స్టీల్స్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

stell plant: వెయ్యి ఎకరాల్లో కల్యాణి స్టీల్స్‌
మూలపేటలో పర్యటించిన కల్యాణి స్టీల్స్‌ బృందం, రెవెన్యూ అధికారులు(ఫైల్‌)

  • - మూలపేట పోర్టు పరిధిలో ఏర్పాటుకు స్థల పరిశీలన

  • టెక్కలి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పరిధిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. రూ.30వేల కోట్లతో వెయ్యి ఎకరాల్లో కల్యాణి స్టీల్స్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం పూణే నుంచి కల్యాణి స్టీల్స్‌ సంస్థ హెచ్‌ఆర్‌ సింగ్‌తో పాటు లాజిస్టిక్‌ మేనేజర్‌, ఇతర నిపుణులు.. రెవెన్యూ అధికారులతో కలిసి మూలపేట సమీపంలోని సమీర్‌పేట లాజిస్టిక్స్‌కు చెందిన వెయ్యి ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంతోపాటు రైలు, రోడ్డు మార్గాలు, విద్యుత్‌, నీటి సరపరా అవసరాల సాధ్యాసాధ్యాలపై ఆరా తీశారు. గొట్యాబ్యారేజ్‌ నుంచి అవసరమైన నీటిని, రావివలస 220 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి ఆ బృందానికి వివరించారు. అనంతరం కల్యాణి స్టీల్స్‌ సంస్థ సభ్యులు భావనపాడు తీరం, ఇతర ప్రాంతాలు, ఈస్ట్‌కోస్ట్‌ పవర్‌ప్లాంట్‌ స్థలాలు పరిశీలించారు.

Updated Date - Apr 28 , 2025 | 11:29 PM