నృత్యంలో.. సిక్కోలు ఖ్యాతి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:29 PM
నృత్యంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కరలేని పేరు నీరజ సుబ్రహ్మ ణ్యం. తన నృత్య ప్రదర్శనలతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశారు.

శ్రీకాకుళం కల్చరల్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): నృత్యంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కరలేని పేరు నీరజ సుబ్రహ్మ ణ్యం. తన నృత్య ప్రదర్శనలతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఆమె బాటలోనే కుమార్తె సింధు శ్రీహర్షిత కూడా నృత్యప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. నేడు ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా వారిపై ప్రత్యేక కథనం. శ్రీకాకుళంలోని టీపీఎం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో నీరజ సుబ్రహ్మణ్యం హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించేవారు. చిన్నప్పటి నుంచి నృత్యంపై ఆమెకు ఉన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. వేలాది ప్రదర్శనలు ఇచ్చి.. ఎన్నో అవార్డులు అందుకున్నారు. అక్కడితో ఆగకుండా అభినయ నృత్యనికేతన్ సంస్థను స్థాపించి సుమారు 100 మందికి పైగా నృత్యంపై శిక్షణ ఇస్తున్నారు.
ఎన్నో పురస్కారాలు, సత్కారాలు..
- 1992, 1994 మహారాష్ట్రలో మెహర్‌బాద్ లో భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేస్తూ మెహర్‌బాబా కూతురు మెహర్‌మనిజా చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
- 2002లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
- బరంపురంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్స్ కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.
- ఢిల్లీలో అంతర్జాతీయ నృత్య సమ్మేళనం లో అన్ని దేశాల నుంచి వచ్చి 1000 మందితో కలిసి ప్రదర్శన ఇచ్చి సత్కారం పొందారు.
- 2015లో కళాతేజం పురస్కారం, భాషశ్రీ పురస్కారం అందుకున్నారు.
- 2010లో నేపాల్‌లో హిమాలయ ప్రాంతంలో పశుపతినాఽథ్ ఆలయం వద్ద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
- 2014లో థాయ్‌లాండ్ దేశంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి అక్కడ మంత్రులు అధికారుల ప్రశంసలు అందుకున్నారు.
ఫ 2017లో మలేషియాలో శత నృత్య ప్రదర్శనల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన నృత్యకారులతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
టీవీ, చలనచిత్ర రంగంలోనూ..
ఫ టెలివిజన్, చలనచిత్ర రంగంలోనూ నీరజా సుబ్రహ్మణ్యం తనదైన ప్రతిభ చూపారు. టెలిఫిలిమ్స్‌లో ఆమె దర్శకత్వం వహిస్తూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేశారు.
ఫ 1995లో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తీసిన టెలీఫిలింలో నటించి గుర్తింపు పొందారు.
ఫ ఆదిత్య మ్యూజిక్ వారి ఉద య కిరణాలు ఆడియో వీడియో నిత్య ప్రదర్శన నిర్వహించారు.
ఫ రాఘవేంద్రస్వామి సినిమా లో నటించి గుర్తింపు పొందారు.
ఫ ఢిల్లీలో 6000 మందితో సిలికాంద్ర ఇంటర్నేషనల్ నృత్య ప్రదర్శనలో కూచిపూడి మహత్యం నాట్యం ప్రదర్శించారు.
ఫ 2014లో శిష్య బృందంచే నృత్య ప్రదర్శన లు చేసి గిన్నీస్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు.
ఫ 2013లో ఢిల్లీలో ఏపీ భవన్‌లో కూచి పూడి నృత్య ప్రదర్శనలు చేస్తూ నాట్యనీరజ బిరుదు కూడా పొందారు.
ఫ హాయ్‌లాండ్‌లో వరల్డ్ బుద్ద టూరిజం ఆధ్వర్యంలో వండర్ వరల్డ్ వార్షికోత్సవంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు.
ఫ ఆడేపాడే తోలుబొమ్మ చలనచిత్రానికి నీరజా సుబ్రహ్మణ్యం కొరియోగ్రఫీగా వ్యవహరించారు. అందరూ మహిళలతోనే సినిమా తీయడం విశేషం.
ఫ ‘మా ఊరి మంకినమ్మ’ చలన చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఫ ఉత్తమ యువనాట్య కళాకారిణి అవార్డు, ఉత్తమ నృత్య దర్శకురాలిగా మూడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్ట్స్, ఎన్నో అవార్డులు అందుకున్నారు.
తల్లి అడుగుజాడల్లోనే కుమార్తె..
నృత్య దర్శకురాలు నీరజ సుబ్రహ్మణ్యం అడు గుల్లోనే ఆమె కుమార్తె సింధు శ్రీహర్షిత కూడా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతూ నృత్య ప్రదర్శనలు ఇస్తూ పేరు ప్రఖ్యాతలు సంపా దించారు. ఈమె చిన్నప్పటి నుంచి తల్లి నీరజా సుబ్రహ్మణ్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకొని ఇప్పటి వరకు 2వేల వరకు ప్రదర్శనలు ఇచ్చారు. 23 పురస్కారాలు, 200పైగా సన్మానాలు పొందా రు. మలేషియాలో తల్లి నీరజతోపాటు సింధు శ్రీహర్షిత కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రశం సలు అందుకున్నారు. ఈమె కూడా 3 గిన్నీస్ బు క్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సాధించారు. ఈమె నాట్య రవళి, నాట్య మయూరి బిరుదులు పొందారు.