Share News

Culvert damage: కూలిన కల్వర్టు

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:51 AM

culvert Collapsed.. Traffic is closed సంతబొమ్మాళి మండలంలోని బోరుభద్ర-పాతమేఘవరం ఆర్‌అండ్‌బీ రహదారిలో చిదపానిపేట వద్ద కల్వర్టు శుక్రవారం ఉదయం కూలిపోయింది. దీంతో ఈ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. సంధిపేట, రాజపురం, మూలపేట ప్రాంతాలకు వెళ్లే వంశధార కాలువపై కొన్నేళ్ల కిందట ఈ కల్వర్టు నిర్మించారు.

Culvert damage: కూలిన కల్వర్టు
చిదపానపేట వద్ద కూలిపోయిన కల్వర్టు

  • బోరుభద్ర, నౌపడ ప్రాంతాలకు రాకపోకలు బంద్‌

  • సంతబొమ్మాళి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలంలోని బోరుభద్ర-పాతమేఘవరం ఆర్‌అండ్‌బీ రహదారిలో చిదపానిపేట వద్ద కల్వర్టు శుక్రవారం ఉదయం కూలిపోయింది. దీంతో ఈ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. సంధిపేట, రాజపురం, మూలపేట ప్రాంతాలకు వెళ్లే వంశధార కాలువపై కొన్నేళ్ల కిందట ఈ కల్వర్టు నిర్మించారు. ఈ రహదారిలో వందల టన్నుల బరువుండే పోర్టు వాహనాలు, రొయ్యల లారీలు రాకపోకలు సాగించడంతోనే కల్వర్టు కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్వర్టు కూలిపోవడంతో బోరుభద్ర, నౌపడ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాతమేఘవరం, సందిపేట, రాజపురం, లింగూడు గ్రామాల ప్రజలు బోరుభద్ర రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మేఘవరం, మరువాడ, లక్కివలస, కొల్లిపాడు పంచాయతీల ప్రజలు నౌపడకు వెళ్లే మార్గం లేదని వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లే అవకాశం లేక విద్యార్థులు, మత్స్యకారులు, ఈ ప్రాంతవాసులు అవస్థలు పడుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:51 AM