డీ పట్టా భూముల్లో.. 40 మంది నకిలీలు
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:50 PM
జగతిమెట్ట ఇళ్ల కాలనీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న కొలదీ అప్పటి రెవె న్యూ సిబ్బంది అక్రమాలు బయటప డుతూనే ఉన్నాయని ఆర్డీవో ఎం.కృ ష్ణమూర్తి తెలిపారు.

జగతిమెట్ట ఇళ్ల కాలనీలో బయటపడుతున్న అక్రమాలు
ఒకే వీఆర్‌వో పోర్జరీ సంతకాలతో ఎనిమిది పట్టాలు జారీ చేసినట్లు గుర్తింపు
ఆర్డీవో కృష్ణమూర్తి
టెక్కలి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): జగతిమెట్ట ఇళ్ల కాలనీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న కొలదీ అప్పటి రెవె న్యూ సిబ్బంది అక్రమాలు బయటప డుతూనే ఉన్నాయని ఆర్డీవో ఎం.కృ ష్ణమూర్తి తెలిపారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. ‘జగతిమెట్ట ఇళ్ల కాలనీలకు సం బంధించి డీ పట్టా రైతుల నుంచి ల్యాం డ్‌ఎక్విజేషన్ చేసినవారిలో 30మంది రైతులైతే.. అప్పటి రెవెన్యూ సిబ్బంది 70మంది పేర్లు సృష్టించి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించాం. 40 మందికి నకిలీ పట్టాలిచ్చినట్టు తేలింది. వాస్తవానికి ల్యాండ్‌ఎక్వి జేషన్‌లో డీ పట్టా తీసుకున్న రైతు లకు ఒక్కొక్కరికి ఒక టిన్నర సెంట్లు కేటాయించాలి. కానీ కొంతమంది రెవెన్యూ సిబ్బంది నిబం ధనలు తుంగలో తొక్కి అనర్హులకు సైతం పట్టాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో వీఆర్‌వో ఎస్.వైకుంఠరెడ్డి అంతా తానై.. తహసీ ల్దార్ మొదలుకొని రెవెన్యూ సిబ్బంది సంతకాలు ఫోర్జరీ చేసి ఎనిమిది మందికి పట్టాలు జారీచేసినట్లు ప్రాథమికంగా గుర్తించాం. చింతాడ విజయ్‌కుమార్(పట్టా నెం.288), పట్నాన సరోజినమ్మ (పట్టా:300), కంటా సంతోషమ్మ (పట్టా:301), పట్నాన రత్నాలు(పట్టా:303), పట్నాన సుహాసిని(పట్టా:304), తొగరాన వరలక్ష్మి(పట్టా:307).. ఇలా పలువురికి తప్పుడు పట్టాలతో విక్రయించారు. ఆ సర్వే నెంబర్లలో 388మందికి మాత్రమే పట్టాలు ఇవ్వాల్సి ఉండగా, మరికొందరు వీఆర్‌వోలు ఐదుకు తక్కువ లేకుండా పట్టాలు సృష్టించి అనర్హులకు పంపిణీ చేశారు. అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బంది ఎంతటివారైనా సస్పెన్సన్ చేసేందుకు చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.