Share News

Judicial Custody : కల్తీ నెయ్యి నిందితులకు ముగిసిన సిట్‌ కస్టడీ

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:52 AM

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నిందితులకు సిట్‌ కస్టడీ మంగళవారం ముగిసింది.

Judicial Custody : కల్తీ నెయ్యి నిందితులకు ముగిసిన సిట్‌ కస్టడీ

తిరుపతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నిందితులకు సిట్‌ కస్టడీ మంగళవారం ముగిసింది. దీంతో వారిని సిట్‌ అధికారులు తిరుపతి సబ్‌జైలులో తిరిగి జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించారు. కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా ఉన్న ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, వైష్ణవీ డెయిరీ సీఈవో వినయ్‌కాంత్‌ చావడాకు రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం సబ్‌జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై 2వ ఏడీఎం కోర్టులో బుధవారం విచారణ జరగనుంది.

Updated Date - Feb 19 , 2025 | 04:52 AM