బీజేపీకి కాంగ్రెస్ అంటే భయం: షర్మిల
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:50 AM
బీజేపీ కాంగ్రెస్ ఎదుగుదలపై భయపడిపోతుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. భ్రష్టు-జుమ్లా పార్టీని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పై అక్రమ కేసులు వేయడం తీవ్రంగా ఖండించారు

అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ‘భ్రష్ట్ జుమ్లా పార్టీ... బీజేపీకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుంది. దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుంది. అందుకే దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను సొంత ఏజెన్సీలుగా వాడుతోంది’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ‘‘ప్రతిపక్షంపై బీజేపీ అక్రమ కేసులు బనాయిస్తోంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేయడాన్ని, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ మీద మీరు చార్జిషీట్ వేయడం కాదు... బీజేపీ మీదే ప్రజలు చార్జ్‌షీట్ వేసే సమయం దగ్గరపడింది’ అని షర్మిల వ్యాఖ్యానించారు.