AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:48 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 ఎంపీటీసీ 2 జడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాల ఎన్నికలకు ఇవాళ (జులై 28)నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో రామకుప్పం, కారంపూడి, విడవలూరు ఎంపీటీసీ ఎన్నికలు..

అమరావతి, జులై, 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 ఎంపీటీసీ 2 జడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాల ఎన్నికలకు ఇవాళ (జులై 28)నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో రామకుప్పం, కారంపూడి, విడవలూరు ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక, ఇదే క్రమంలో కొండపూడి, కడియపులంక గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతాయి.
ఇక, జూలై 30 నుండి ఆగష్టు 1 వరకూ నామినేషన్ల స్వీకరణకు అనుమతిస్తారు. ఆగస్టు 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనుండగా, ఆగస్టు 14న ఏపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆగస్టు 10న సర్పంచ్ ఎన్నికలు .. ఉండగా, అదే రోజున ఫలితాలు విడుదల చేస్తారు.