Visakhapatnam: విశాఖ తీరంలో చేపల వేటపై ఆంక్షలు.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:43 PM
విశాఖపట్నం సముద్ర తీరంలో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

విశాఖపట్నం, జూన్ 19: విశాఖపట్నం సముద్ర తీరంలో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. విశాఖపట్నం వేదికగా ఈ కార్యక్రమం భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం తీరంలో జూన్ 20, 21వ తేదీల్లో అంటే.. శుక్రవారం, శనివారం చేపల వేటపై ఆంక్షలు విధించారు. ఈ రెండు రోజుల్లో ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపల వేటపై నిషేధం విధించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారని.. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నం వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమానికి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు తరలి రానున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు.. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల నిషేధ కాలం శనివారంతో అంటే.. జూన్ 14వ తేదీతో ముగిసింది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం జూన్ 14వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో చేపల వేట సాగించడానికి మత్స్యకారులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు సముద్రంలో చేపలు, రొయ్యలు, ఇతర సంపద వేటపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడ చదవండి..
విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్..!
For AndhraPradesh News And Telugu News