Share News

నీటి వనరుల అభివృద్ధి జరిగేనా?

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:03 PM

సకల జీవరాసులకైనా, పంటలకైనా నీరే ప్రాణాధారం. భూగర్భంలో సమృద్ధిగా నీరంటూ ఉంటే బావుల ద్వారానో, బోర్ల ద్వారానో తోడుకొని పంటలు పండించవచ్చు. ఏటికేడు భూగర్భంలో జలాలు అడుగంటుతుంటే అన్నదాతలు ఆశలు ఆవిరై పోతున్నాయి. వర్షాధాంతో సాగు చేసే పరిస్థితి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం రైతులది.

నీటి వనరుల అభివృద్ధి జరిగేనా?
చిల్ల కంపతో అల్లుకుపోయిన చిన్నగుడిపాడు చెరువు

ఆరేళ్ల కిందట నీరు,చెట్టు కింద అభివృద్ధి పనులు

వైసీపీలో పట్టించుకోని వైనం

పూడికతో అస్తవ్యస్తంగా చెరువులు, వాగులు, కుంటలు

ఒట్టిపోయిన బోరుబావులు

పెద్ద దోర్నాల, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : సకల జీవరాసులకైనా, పంటలకైనా నీరే ప్రాణాధారం. భూగర్భంలో సమృద్ధిగా నీరంటూ ఉంటే బావుల ద్వారానో, బోర్ల ద్వారానో తోడుకొని పంటలు పండించవచ్చు. ఏటికేడు భూగర్భంలో జలాలు అడుగంటుతుంటే అన్నదాతలు ఆశలు ఆవిరై పోతున్నాయి. వర్షాధాంతో సాగు చేసే పరిస్థితి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం రైతులది. ఈ ప్రాంతంలో ఉన్న నీటి వనరులు చెరువులు, కుంటలు, వాగులు పూర్తి సామర్థ్యంతో ఉన్నప్పుడే వర్షపు నీటి నిల్వ శాతం పెరుగుతుంది. ఆ నీటి వనరులను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసినప్పుడే వాన నీటిని ఒడిసి పట్టుకోగలం. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులకు భిన్నంగా తయారయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వం నీరు-చెట్టు పథకంలో భాగంగా చెరువులు, వాగులు, కాలువలు, కుంటల్లో కంప తదితరాలను తొలగించి మేట వేసిన మట్టిని తోడి పొలాలకు తరలించడం ద్వారా నీటి సామర్థ్యం పెరిగింది. వ్యవసాయ భూములు సారవంతమయ్యాయి. భూగర్భ జలాలు పెరిగి సేద్యం లాభసాటిగా మారింది.

పట్టించుకోని వైసీపీ పాలకులు

గత వైసీపీపాలకులు పట్టించుకోక పోవడంతో చెరువులు, కుంటలు, వాగులు, కాలువల్లో చిల్లకంప పెరిగి వర్షానికి చెక్‌డ్యాంలు తెగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వానలు పడినా వనరుల్లో నీరు లేకుండా పోయింది. దీంతో భూగర్భ జలాల సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. బోరుభావులు వట్టిపోయాయి. పంటలకు కీలక సమయంలో తడులు ఇవ్వలేక ఎండిపోయి రైతులు నష్టాలను చూశారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే వృథాగా పోయే వాన నీటిని భూమిలోపలికి ఇంకింప జేసుకోవడమే సరైన మార్గం.

వచ్చే ఖరీ్‌ఫకైనా దృష్టి సారించేనా

ప్రభుత్వం ఏర్పడి పది నెలల కావస్తోంది.ఈ ఏడాది కూడా మండలంలో వర్షాభావం ఏర్పడింది. నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో వాగులు ప్రవహించి చెరువులకు పుష్కలంగా నీరు చేరింది. నీటి సామర్థ్యం కోల్పోయి ఉండడంతో ఆ నీరు ఎంతో కాలం నిల్వ లేదు. దీంతో పంట దశలో నీటి కొరత ఏర్పడింది. మండలంలో ఎగువ చెర్లోపల్లి, పెద్ద బొమ్మలాపురం, కడపరాజుపల్లె, బలిజేపల్లి,చిన్నగుడిపాడు చెరువులు పెద్దవి. అధిక విస్తీర్ణంలో ఆయకట్టు భూములు ఉన్నాయి. గంటవానిపల్లె చెరువులో ఇప్పటికీ నీరు ఉంది. వెలిగొండ ప్రాజెక్టు వ్యర్థ నీరు ప్రవహిస్తుండడంతో ఆ చెరువులోకి నీరు చేరింది. తద్వారా పరిసర రైతులకు ఉపయుక్తంగామారింది. పెద్ద చెరువులతో పాటు చిన్న చిన్న కుంటలు, కాలువుల ద్వారా పొలాలకు సాగు నీరందుతోంది. మండలం మొత్తం మీద పది వేల ఎకరాలకు పైగా ఆయకట్టు భూములు సాగులోకి వస్తాయి. కాగా ఏ పొలాలకు కూడా సాగు నీరు అందించే (సప్లై చానల్‌)సాగు కాలువులు లేవు. అన్నీపాడయ్యాయి. ఎక్కువ శాతం ఆక్రమణకు గురయ్యాయి. చెరువుల తూములు చెడిపోయాయి. చెరువు కట్టలపై చిట్టడవిలా చెట్టు, పొదలు అల్లుకుపోయాయి. వచ్చే ఖరీఫ్‌ నాటికి ప్రత్యేక చర్యలు చేపట్టి చెరువులు, వాగులు, కాలువలు, కుంటలను ప్రభుత్వం అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:03 PM