పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:13 PM
దర్శి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు హమీ ఇచ్చినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.

దర్శి సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం
టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): దర్శి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు హమీ ఇచ్చినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సీఎం దర్శికి వచ్చిన సందర్భంగా డాక్టర్ లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు ఆయనకు బోకే అందించి అభినందనలు తెలిపారు. బస్సులో సీఎంకు దర్శి నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పథకాలను పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించా రు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆరంభించిన ప్రాజెక్టులన్నీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్షంగా వదిలేశారని తెలిపారు. జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం తమ హయాంలోనే ఆరంభించారని, ప్రస్తుతం పునాదుల్లోనే ఉన్నదని చెప్పారు. తాజా అంచనాలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందించటం జరిగిందని వివరించారు. అందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి వెంటనే పనులు ప్రారంబించేందుకు చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చినట్లు వివరించారు. దర్శిలో నిలచిన కోల్డ్ స్టోరేజీ, క్రీడా వికాసకేంద్రం పనులు పూర్తి చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధిచేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఆమె కోరారు. దర్శిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని వెంకట చలంపల్లి-దొనకొండ రోడ్డును డబుల్‌రోడ్డుగా అభివృద్ధి పర్చాలని ఆమె కోరగా అందుకు సానుకూలంగా స్పందించారని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దొనకొండలో వెలుగులు నిండుతాయని కారిడార్‌కు అ వ సరమైన నీటి వనరులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అందుకు సీఎం స్పందిస్తూ చెప్పిన మాట ప్రకారం వెలిగొండను వచ్చే ఏడాదిలో మొదటి దశ పూర్తి చేసి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరొసా ఇచ్చినట్లు వివరించారు. తూర్పువీరాయపాలెం గ్రామంలో అంతర్గత రోడ్లు, మురికి కాల్వల అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరగా సీఎం చంద్రబాబు వెంటనే కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆమె వివరించారు. అర్హులైన పేదలకు 90 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరగా వెంటనే చేయాలని ఆదికారులను ఆదేశించినట్లు తెలిపారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు భరోసా ఇవ్వటం పట్ల డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు.
ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణిని అభినందించిన సీఎం
దర్శి ఏఎంసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దారం నాగవేణిని సీఎం చంద్రబాబు అభినందించారు. హెలిప్యాడ్ వద్ద నాగవేణి, సుబ్బారావు దంపతులు టీడీపీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులతో కలిసి సీఎం చంద్రబాబుకు బొకే, వెంకటేశ్వరస్వామి ప్రతిమ అందించి ధన్యవాదాలు తెలిపారు. తొలుత ఈనెల 3న స్థానిక మార్కెట్‌యార్డులో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం నిర్వహించుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సీఎం దర్శి పర్యటన ఖరారు కావటంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈసందర్భంగా సీఎం వారిని అభినందిస్తూ రైతుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూ చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కడియాల రమేష్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
దర్శి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పర్యటనలో ఓ బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. ప్రశాంతి అనే మహిళ దివ్యాంగుడైన తమ కుమారుడిని తెచ్చి న్యాయం చేయాలని కాన్వాయ్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసింది. కుమారుడి వైద్యానికి సహాయం అందించాలని కోరింది. అందుకు వెంటనే స్పందించిన సీఎం రూ.1.50 లక్షలు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఆదేశించారు. బాలుడి వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించటంతో ఆ బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది.