ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:00 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఉద్యోగులకు సూచించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఎమ్మెల్యే సచివాలయాల సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వారి అవసరాల నిమిత్తం సచివాలయానికి వచ్చినపుడు వారిచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కారం చేసి జవాబుదారీ తనంతో విధులు నిర్వహించాలన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఉద్యోగులకు సూచించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఎమ్మెల్యే సచివాలయాల సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వారి అవసరాల నిమిత్తం సచివాలయానికి వచ్చినపుడు వారిచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కారం చేసి జవాబుదారీ తనంతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించడమే కాకుండా సంక్షేమ పథకాల అమలులో అర్హులకు లబ్ధిచేకూరే విధంగా కృషి చేయాలన్నారు. ప్రజల్లో అపోహలు లేకుండా పారదర్శకంగా అబ్ధిదారులను గుర్తించాలన్నారు. ప్రజాసంక్షేమ పాలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, అందుకు అనుగుణంగా మీరూ పని చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, కమిషనర్ శ్రీనివాసులు, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.