Share News

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 10:15 PM

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వా రా ప్రభుత్వం ఇస్తున్న రాయితీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌ నాయక్‌ కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను వినియోగించుకోవాలి

ఈడీ అర్జున్‌ నాయక్‌

మార్కాపురం రూరల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వా రా ప్రభుత్వం ఇస్తున్న రాయితీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌ నాయక్‌ కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 1305 రుణాలను 38 మండలాలు, 8 మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన లబ్ధిదారులకు రుణాలు మం జూరు చేయనున్నట్లు తెలిపారు. 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అర్హులు ఓబీఎంఎస్‌ పోర్టల్‌లో వారి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. మొత్తం మూడు విభాగాలుగా రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల లోపు యూనిట్ల ఏర్పాటుకు 60 శాతం రాయితీ 5 శాతం లబ్ధిదారుని వాటా మిగిలిన 35 శాతం బ్యాంకు ద్వారా రుణాలను పొందాలని తెలిపారు. రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల లోపు యూనిట్ల ఏర్పాటుకు 50 శాతం రాయితీ 5 శాతం లబ్ధిదారుని వాటా మిగిలిన 45 శాతం బ్యాంక్‌ ద్వారా రుణం పొందాలని తెలిపారు. రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు ఆపైన 40 శాతం రాయితీ 5 శాతం లబ్ధిదారుని వాటా మిగిలిన 55 శాతం బ్యాంకు ద్వారా రుణం పొందాలని తెలిపారు. కార్లు, గూడ్స్‌ అటోలు, కార్లకు 50 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి జిల్లాకు 12 డ్రోన్‌లను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన వారు ఈనెల 14వ తేదీ నుంచి మే 10 వరకు పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చునని తెలిపారు. మే 10 తేదీ తర్వాత లబ్ధిదారులను పరిశీలించి తుది జాబితా బ్యాంక్‌ వారికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఓబీఎంఎస్‌ పోర్టల్‌లో అప్లై చేసుకున్నవారికి పొరపాట్లు జరిగి ఉంటే ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీని సంప్రదించి సరిచేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

Updated Date - Apr 29 , 2025 | 10:15 PM