Share News

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:36 AM

ప్రజా ఫిర్యాదులపై అలసత్యం వహించ వద్దని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యాక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 69 ఫిర్యాదులు ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే చట్టపరిధిలో పరిష్కరించాలని అన్నారు.

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
ఫిర్యాదుదారుడి సమస్యను వింటున్న ఎస్పీ దామోదర్‌

ఒంగోలు క్రైం,ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులపై అలసత్యం వహించ వద్దని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యాక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 69 ఫిర్యాదులు ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే చట్టపరిధిలో పరిష్కరించాలని అన్నారు.

ముఖ్యమైన ఫిర్యాదులు

జిమ్‌ కోసం స్థానిక కర్నూల్‌రోడ్డులోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంక్‌లో రుణం తీసుకున్నాడని, ఎంతకీ చెల్లించక పోవడంతో బ్యాంక్‌ నుంచి తనకు నోటీసులు వచ్చాయని ఓ బిల్డింగ్‌ యజమాని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇదేమిటని జిమ్‌ నిర్వాహకులను అడుగుతుంటే తనను బెదిరిస్తున్నాడని ఎస్పీ ఎదుట వాపోయారు.

ఫ కుటుంబ అవసరాలకోసం నన్ను షూరిటీగా పెట్టి ఓ వ్యక్తి ఐదు లక్షలు రుణం తీసుకున్నాడని, చివరకు చెల్లని బ్లాంక్‌ చెక్‌ ఇచ్చాడని ఇదేమిటి అని అడిగితే బెదిరిస్తున్నాడని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.నాగేశ్వరావు,సీఐలు నాగరాజు,దేవప్రభాకర్‌, ఎస్పైలు రజియా సుల్తానా,ప్రభాకర్‌ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:36 AM