Share News

మోదీ పర్యటనను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:43 AM

దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన దామచర్ల మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో మే 2వ తేదీన అమరావతిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా ప్రధాని హాజరు కావడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పార్టీశ్రేణులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు.

మోదీ పర్యటనను   విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌

ఒంగోలు, కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన దామచర్ల మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో మే 2వ తేదీన అమరావతిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా ప్రధాని హాజరు కావడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పార్టీశ్రేణులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ప్రత్యేకించి నియోజకవర్గం నుంచి 5వేల మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు, సీడ్స్‌ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధాన నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బండారు మదన్‌తోపాటు పార్టీ శ్రేణులు, మహిళా నాయకులు, ఒంగోలు రూరల్‌, కొత్తపట్నం మండలం, నగరానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.ఠి

Updated Date - Apr 29 , 2025 | 12:43 AM