మహాకుంభాభిషేకం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:21 PM
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం మహాకుంభాభిషేకం మే నెల 19వ తేదీన నిర్వహించనున్నారు.

ప్రథమ ఆహ్వాన పత్రికను లక్ష్మీనరసింహస్వామికి అందజేత
అద్దంకి, ఏప్రిల్28(ఆంధ్రజ్యోతి): శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం మహాకుంభాభిషేకం మే నెల 19వ తేదీన నిర్వహించనున్నారు. ఆహ్వా న పత్రికలు, వాల్‌పోస్టర్‌లను విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ఉదయం చిలకలూరిపేటలోని మంత్రి స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ మహాకుంభాభిషేకం విజయవంతం అయ్యేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. శింగరకొండ అభివృద్ధికి మరింత ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఈవో తిమ్మానాయుడు, వేదపండితులు హరిశంకరావధాని, ప్రధాన పూజారి లక్ష్మీనారాయణ, ఇతర పూజారులు, సిబ్బంది మంగళవాయిద్యాలతో వెళ్లి తొలి ఆహ్వాన పత్రికను క్షేత్రాధిపతి లక్ష్మీనరసింహస్వామికి అందజేశారు. అనంతరం గ్రామదేవత పోలేరమ్మకుఅందజేసి పసుపు, కుంకుమ, పుష్పాలు, నూతన వస్ర్తాలు సమర్పించారు. మహాకుంభాభిషేకం ఉత్సవాలు మే నెల 14 నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని ఈవో తిమ్మానాయుడు తెలిపారు. 19న ఉదయం 9-03 గంటలకు శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి నూతన దేవాలయం విమాన శిఖర జీవధ్వజ ప్రతిష్టాపూర్వక మహాకుంభాభిషేకం కార్యక్రమాలు శృంగేరి శారదా పీఠ ం ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు.