మోదీ పర్యటనను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:18 PM
మే 2వ తేదీన అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికి, ఆ సభను విజయవంతం చేద్దామ ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడారు.

కార్యకర్తల సమావేశంలో
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2వ తేదీన వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికి, ఆ సభను విజయవంతం చేద్దామ ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడారు. అమరావతి రాజధాని తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీయే విధానమని, 2014 నుంచి కేంద్ర విద్యాసంస్థలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటు చేశారని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశారన్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధితో ఆదా యం మెండుగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణానికి శ్రమిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. సమావేశంలో 6 మం డలాల పట్టణ పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మోహన్‌రెడ్డి, యోగానంద్, శ్రీనివాసులు, శానేషావలి, టీడీపీ నాయకులు దప్పిలి భాస్కర్‌రెడ్డి, కొత్తపల్లి శ్రీను పాల్గొన్నారు.