ఉపాధి పనుల పరిశీలన
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:22 PM
మండలంలోని మర్రీవేముల గ్రామంలో బోగస్ మస్టర్లపై మార్కాపురం ఏపీడీ నిర్మలాదేవి మంగళవారం విచారణ జరిపారు.

కొలతలు తీయిస్తామని ఏపీడీ వెల్లడి
పుల్లలచెరువు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మర్రీవేముల గ్రామంలో బోగస్ మస్టర్లపై మార్కాపురం ఏపీడీ నిర్మలాదేవి మంగళవారం విచారణ జరిపారు. మర్రివేములలో జరుగుతున్న ఉపాధి పనులను ఆమె పరిశీలించి కూలీలతో మాట్లాడారు. హాజరైన కూలీలు, చేసిన పనులకు మధ్య తేడాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. సిబ్బందితో కొలతలు తీయించి జిల్లా ఉన్నాతాధికారులకు నివేదిక అందజేస్తామని ఏపీడీ తెలిపారు.