Share News

విజన్‌ ప్లాన్‌పై దృష్టి సారించాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:17 AM

నియోజక వర్గ స్థాయి పరిస్థితులు, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి విజన్‌ ప్లాన్‌ను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సూచించారు. స్థానిక ఎన్‌జీవో భవన్‌లో సోమవారం స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో భాగంగా నియోజకవర్గాల విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన, ముఖ్య నిర్దేశిత లక్ష్యాలపై ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులకు ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో కలెక్టర్‌ మాట్లాడారు.

విజన్‌ ప్లాన్‌పై దృష్టి సారించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులు, వనరులను పూర్తిగా అధ్యయనం చేయాలి

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గ స్థాయి పరిస్థితులు, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి విజన్‌ ప్లాన్‌ను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సూచించారు. స్థానిక ఎన్‌జీవో భవన్‌లో సోమవారం స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో భాగంగా నియోజకవర్గాల విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన, ముఖ్య నిర్దేశిత లక్ష్యాలపై ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులకు ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో కలెక్టర్‌ మాట్లాడారు. స్వర్ణాంధ్ర-47 డాక్యు మెంట్‌లో భాగంగా జిల్లా విజన్‌ ప్లాన్‌ను రూపొందించా మన్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా తయారు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఈ వర్క్‌షా పును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక నియోజకవర్గంలో రానున్న సంవత్సర కాలంలో ఏ రంగం వృద్ధి రేటు ఎలా ఉంటుంది, దానిని ఎలా మరింత అభివృద్ధి చేయాలన్న అంశాలపై నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణా ళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వర్క్‌షాపులో ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాల తోపాటు ప్రైమరీ, సెకండరీ, సర్వీస్‌ తదితర రంగాలపై అవగాహన కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో పరిస్థితులు, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి.. సృజనాత్మకంగా ఆలోచించి ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందేలా ప్రణాళికలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ వర్క్‌షాపులో ప్రకాశం, నెల్లూరు జిల్లాల సీపీవోలు వెంకటేశ్వర్లు, రఘురామయ్య, ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ సలహాదారు సీతాపతి పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 01:17 AM