విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:14 PM
విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ రైల్వే జోన్‌కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం దొనకొండ రైల్వేస్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ప్రత్యేక రైలులో గుంటూరు నుంచి అన్నీ రైల్వేస్టేషన్లు, రైల్వేట్యాక్, సిగ్నలింగ్ వ్యవస్థలలో సమగ్ర భద్రతా తనిఖీలు చేస్తూ దొనకొండకు చేరారు.
ప్రిన్సిపల్ చీప్ సేఫ్టీ అధికారి వెంకటరమణారెడ్డి
దొనకొండ రైల్వే స్టేషన్ తనిఖీ
దొనకొండ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ రైల్వే జోన్‌కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం దొనకొండ రైల్వేస్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ప్రత్యేక రైలులో గుంటూరు నుంచి అన్నీ రైల్వేస్టేషన్లు, రైల్వేట్యాక్, సిగ్నలింగ్ వ్యవస్థలలో సమగ్ర భద్రతా తనిఖీలు చేస్తూ దొనకొండకు చేరారు. దొనకొండలోని రైల్వేస్టేషన్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి అమృత్‌భారత్ పథకంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైల్వే ఇనిస్టిట్యూట్, ఆడిటోరియం వద్ద రైల్వే అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా రైల్వే సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైల్వే కార్యకలాపాలలో భద్రతా చర్యలను పరిశీలించటం, ప్రయాణికుల సౌకర్యాలను అంచనా వేయటంపై దృష్టి సారించినట్టు చెప్పారు. రైల్వే ఉద్యోగులు విధి నిర్వాహణలో భద్రతా చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల న్నారు. కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు సీఎస్‌ఈ భూపతిసింగ్, సీఈ మోహిత్‌వర్మ, సీఈడీఈ తోరియ, గుంటూరు రైల్వే డివిజనల్ అసిస్టెంట్ రైల్వే డివిజనల్ మేనేజర్ సైమన్, డీఈఎన్ భరత్, తదితరులు పాల్గొన్నారు.