Share News

అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 10:57 PM

అమరావతి పునర్‌ నిర్మాణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 28 ( ఆంధ్రజ్యోతి) : అమరావతి పునర్‌ నిర్మాణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన, ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పరిశీలకుడు కే శ్రీనివాసగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, టీడీపీ దోర్నాల మండల అధ్యక్షుడు యేర్వ మల్లికార్జునరెడ్డి, వేగినాటి శ్రీను, సుబ్బారెడ్డి, వెంకటరాములు పాల్గొన్నారు.

టైలర్స్‌ అసోసియేషన్‌కు రూ.లక్ష సాయం

మాట నిలుపుకున్న ఎరిక్షన్‌బాబు

టైలర్స్‌ డే సందర్బంగా టైలర్స్‌ అసోసియేషన్‌కు సోమవారం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. టైలర్స్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని గతంలో మాట ఇచ్చిన ఎరిక్షన్‌బాబు ఆమేరకు లక్ష నగదును అందజేశారు. దీంతో ఎరిక్షన్‌బాబును టైలర్స్‌ నాయకులు దుశ్శాలువాకప్పి అభినందించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, టైలర్స్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ వలి, అధ్యక్షుడు వెంకటాచారి, సుబ్రమణ్యం , షక్‌ ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 10:57 PM