రేషన్ బియ్యం మార్కెట్‌కు తరలిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:20 PM
రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లకు తరలిస్తే కఠిన చర్యలు త ప్పవని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. పట్టణంలోని మండల లెవెల్ స్టాక్ పాయింట్, పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ముందుగా వ్యవసా య మార్కెట్ యార్డులోని రేషన్ గోదాం లో తనిఖీలు చేశారు.
జేసీ గోపాలకృష్ణ
మార్కాపురం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లకు తరలిస్తే కఠిన చర్యలు త ప్పవని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. పట్టణంలోని మండల లెవెల్ స్టాక్ పాయింట్, పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ముందుగా వ్యవసా య మార్కెట్ యార్డులోని రేషన్ గోదాం లో తనిఖీలు చేశారు. రేషన్ దుకాణాలకు తరలించిన, మిగిలిన బియ్యం రికార్డులను పరిశీలించి లెక్కించారు. గోడౌన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకును పరిశీలించారు. అక్కడ ఫైర్ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గమనించారు. దుకాణ యజమానికి సూచనలు చేశారు. మార్కాపురం రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి పలు రేషన్ దుకాణాలు, గ్యాస్ గోడౌన్‌లలో తనిఖీలు చేపట్టారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, తహసీల్దార్ చిరంజీవి, అగ్నిమాపకశాఖాధికారి రామకృష్ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ అర్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొదిలి : పట్టణంలో పలు స్టాక్ పా యింట్ ప్రాంతాలను జేసీ గోపాలకృష్ణ మంగళవారం తనిఖీ చేశారు. పట్టణంలోని గ్యాస్ గోడౌన్, హరికృష్ణ, రాఘవేంద్ర సినిమాహాళ్లు, వాటర్‌ప్లాంట్‌లను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాహాళ్లలో ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సరైన సౌకర్యాలు లేవని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. టికెట్ ధరలు, సౌకర్యాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అదే విధంగా కరుణ ఇండేన్ గ్యాస్ స్టాకు పాయింట్‌ను పరిశీలించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదు మేరకు వాటర్ ప్లాం ట్‌లను జేసీ తనిఖీ చేశారు. నిబంధనల ప్లాంట్లలో నిబంధనలు పాటించేలా రో జూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. అనంతరం చింతగుంపల్లిలో రీసర్వే హద్దు రాళ్లను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆ యన వెంట ఇన్‌చార్జి తహసీల్దార్ సురే ష్, డిప్యూటీ తహసీల్దార్ షాజీదా, నగరపంచాయతీ కమిషనర్ నారాయరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ సురేఖ, ఆర్‌ఐ నరసింహారావు, సర్వేయర్ గురవయ్య, వీఆర్వోలు, సిబ్బంది ఉన్నారు.
వైపాలెంలోని వాసవీ రైస్‌మిల్‌ను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే 6వ నెంబర్ చౌకదుకాణంలో స్టాక్ నిల్వలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ఉన్నారు.
మార్కాపురం రూరల్ : మండలంలోని దరిమడుగు గ్రామ పరిధిలో ఉన్న పీ ఎల్పీ ఇండేన్ గ్యాస్ గోడౌన్‌ను సోమవారం అధికారులతో కలిసి తహసీల్దార్ చిరంజీవి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గోడౌన్‌లో అత్యవసర సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమానులతో చర్చించారు. పెట్రోల్ బంకులలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. కారక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్యాస్ ఏజన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.
బేస్తవారపేట : బేస్తవారపేటలోని వాటర్ ప్లాంట్, పెట్రోల్ బంకు, సినిమా థియేటర్లు, గ్యాస్ గోడౌన్‌లను అధికారులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో డి ప్యూటీ తహసీల్దార్, రీసర్వే డీటీ, ఆర్‌ఐ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పాల్గొన్నారు.