Share News

2.68 లక్షల మంది.. రూ.182.74 కోట్లు

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:53 AM

సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి శనివారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు పథకం వర్తించనుంది. జిల్లాలో 2,68,165 మందిని అర్హులుగా గుర్తించారు.

2.68 లక్షల మంది.. రూ.182.74 కోట్లు
రైతులతో ముఖాముఖి కోసం తూర్పువీరాయపాలెం వద్ద పొలాల్లో ఏర్పాటు చేసిన నులక మంచాలు

నేడు అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ

తూర్పువీరాయపాలెంలో ప్రారంభించనున్న సీఎం

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి) : సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి శనివారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు పథకం వర్తించనుంది. జిల్లాలో 2,68,165 మందిని అర్హులుగా గుర్తించారు. ఏడాదికి రూ.20వేల నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు మూడు విడతలుగా జమచేయనున్నారు. మొత్తం రూ.20వేలలో కేంద్రం పీఎం కిసాన్‌ పథకం కింద రూ.6వేలు, రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.14వేలు ఇస్తున్నాయి. అందులో తొలివిడత కేంద్రం రూ.2వేలు, రాష్ట్రం రూ.5వేలు వెరసి రూ.7వేలను శనివారం జమ చేయనున్నాయి. తొలివిడత జిల్లాలో 2,68,165 మంది రైతులకు రూ.182.74కోట్లు నగదు జమకానుంది. అందులో రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.134.08 కోట్లు, కేంద్రం నుంచి రూ.48.66 కోట్లు అందనున్నాయి. ఇదిలా ఉండగా లబ్ధిదారులు జిల్లాలో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో ఉన్నారు. అందువల్ల దర్శి మండలం తూర్పువీరాయపాలెం నుంచి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 01:53 AM