SEEDAP Chairman: రెండేళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం: దీపక్ రెడ్డి
ABN , Publish Date - Nov 11 , 2025 | 08:55 PM
పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం రెండేళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని సీడాప్ ఛైర్మన్ జి. దీపక్ రెడ్డి అన్నారు. వైసీపీ విధానంలో అయితే ఇదే పనికి 15-20 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు.
అమరావతి, నవంబర్ 11: కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం రెండేళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని సీడాప్ ఛైర్మన్ జి. దీపక్ రెడ్డి (SEEDAP Chairman) అన్నారు. వైసీపీ విధానంలో అయితే ఇదే పనికి 15-20 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు 500 నుంచి 1750కి పెరుగుతాయని చెప్పారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అదనంగా 110 సీట్లు పెరుగుతాయని.. మొత్తం 850 సీట్లు పేద విద్యార్థులకే కేటాయించామన్నారు. పీపీపీ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. గత ఐదేళ్లలో ఖర్చు చేసిన రూ.1550 కోట్లు కేంద్ర నిధులేనన్నారు. జగన్ ప్రభుత్వం సొంతంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
స్వర్ణాంధ్ర సాధన దిశగా కూటమి ప్రభుత్వం..
ఐదేళ్లలో కేవలం 18% కాలేజీ నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయని.. నర్సీపట్నం, విజయనగరం కాలేజీలకు నిధుల్లేక పనులు నిలిచిపోయాయని దీపక్ రెడ్డి అన్నారు. జగన్ జారీ చేసిన జీఓలు 107,108,133తో 50% సీట్లు ప్రైవేటుకు కేటాయించారని.. ఫీజులు రూ.10 వేల నుంచి రూ.12–20 లక్షలకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రారంభించిన కాలేజీలను మెడికల్ కౌన్సిల్ తిరస్కరించిందని.. నిర్మాణాలు పాఠశాల స్థాయిలో ఉన్నాయని సీట్లు తగ్గించిందని ఫైర్ అయ్యారు. నీతి ఆయోగ్ నివేదికలో జగన్ పాలనలో ఏపీ 10వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు. కరోనా సమయంలో వైసీపీ నేతలు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారని చెప్పారు. వైసీపీని ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని.. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ అబద్ధపు ప్రచారాలు చేస్తోందన్నారు. ప్రజలు జగన్ ముఠా నాటకాలను తిప్పికొట్టాలని చెప్పారు. స్వర్ణాంధ్ర సాధన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్.. వెనక్కి తగ్గిన జగన్
అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తాం: నారా లోకేష్