వాచ్‌డాగ్‌లా పిటిషన్ల కమిటీ : డిప్యూటీ స్పీకర్
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:47 AM
అసెంబ్లీ పిటిషన్ల కమిటీకి, ప్రభుత్వానికి సంబంధం లేదని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రజా సమస్యల స్వీకారం, జనంలో చైతన్యం తీసుకొచ్చే క్రమంలో సర్కారుపై వాచ్‌డాగ్‌లాగా ఈ కమిటీ ఉంటుందని, ఇది లోక్‌పాల్‌వంటిదని తెలిపారు.

అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ పిటిషన్ల కమిటీకి, ప్రభుత్వానికి సంబంధం లేదని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రజా సమస్యల స్వీకారం, జనంలో చైతన్యం తీసుకొచ్చే క్రమంలో సర్కారుపై వాచ్‌డాగ్‌లాగా ఈ కమిటీ ఉంటుందని, ఇది లోక్‌పాల్‌వంటిదని తెలిపారు. గురువారం అమరావతి శాసససభా భవనంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజుతో కలిసి రఘురామరాజు మీడియా సమావేశం నిర్వహించారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, అటువంటి సైబర్ క్రైమ్స్ నుంచి అమాయకులను కాపాడేందుకు బలమైన చట్టాలు, వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్న ట్లు తెలిపారు. ఈ అంశంపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగే విధం గా చూస్తామనానరు. ఈవిషయాలపై మరింతలోతుగా చర్చ జరిపేందుకు వచ్చే నెల 18వ తేదీన జరిగే పిటిషన్ల కమిటీ సమావేశానికి ఐటీ, హోం శాఖల ఉన్నతాధికారులను కూడా ఆహ్వానిస్తామన్నారు. ఇకనుంచి పిటిషన్ల కమిటీ సమావేశం ప్రతి 15 రోజులకోసారి నిర్వహిస్తామన్నారు. శాసనసభ కనీసం 60 రోజులైనా నడవాలని పిటిషన్ వచ్చిందని, దానిపైనా 18న చర్చిస్తామ ని, ప్రతి 3నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు ఉండేలాచూడాలని అభిప్రాయపడ్డారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సీఎస్‌కు లేఖ రాస్తా
‘సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సీఎ్‌సకు లేఖ రాస్తున్నా’ అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.