Pemmasani Chandrasekhar: గుంటూరు జిల్లాలో 100 పడకల ఆయుష్ ఆసుపత్రి
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:06 AM
గుంటూరు జిల్లాలో యోగా, సహజ చికిత్స పరిశోధనా సంస్థతోపాటు వంద పడకల ఆస్పత్రి, సిబ్బంది నివాస సముదాయానికి కేంద్రం 94కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

నిర్మాణానికి 94 కోట్లు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని
న్యూఢిల్లీ, జూలై 3(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలో యోగా, సహజ చికిత్స పరిశోధనా సంస్థతోపాటు వంద పడకల ఆస్పత్రి, సిబ్బంది నివాస సముదాయానికి కేంద్రం 94కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 15 ఎకరాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ కేంద్రానికి పూర్తి వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పెమ్మసాని పేర్కొన్నారు.