Minister Payyavula Keshav: దొంగ మెయిల్స్‌తో ప్రతిష్ఠకు దెబ్బ
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:45 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీ సే విధంగా మెయిల్స్ పెట్టిన వారిపై ఖచ్చితంగా కేసులు పెట్టి తీరుతాం అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

వారిపై దేశద్రోహం కేసు.. బుగ్గన ఆర్‌బీఐ కంటే గొప్పోడా?: కేశవ్
రాయదుర్గం, జూలై 11(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీ సే విధంగా మెయిల్స్ పెట్టిన వారిపై ఖచ్చితంగా కేసులు పెట్టి తీరుతాం’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో శుక్రవారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఉదయ భాస్కర్ 200 మెయిల్స్ దాకా పెట్టినట్లు మా దృష్టికి వచ్చింది. పెట్టుబడిదారులకు వ్యక్తిగతంగా మెయిల్స్ పెట్టారు. అలాగే సెబీ, ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి, క్యాబినెట్ కార్యదర్శికి కూడా మెయిల్స్ పెట్టారు. సెబీ.. పెట్టుబడిదారులతో పాటు మా నుంచికూడా వివరణ తీసుకుంది. దొంగ ఈ-మెయిల్స్ పంపిన వారిమీద కచ్చితంగా దేశద్రోహం కేసు పెడతాం. క్లియరెన్స్ ఇవ్వడానికి ఆర్‌బీఐ ఎవరని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ఆర్‌బీఐ కంటే రాజేంద్రనాథ్‌రెడ్డి గొప్పోడు కాదు.’ అన్నారు.