Share News

AP Deputy CM: నటి పాకీజాకు పవన్‌ ఆపన్నహస్తం

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:57 AM

సినీ నటి వాసుకి(పాకీజా) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆమెకు ఆప్తహస్తం అందించారు. పాపం పాకీజా శీర్షికన రెండ్రోజుల క్రితం ఆమె దీనస్థితిని వెలుగులోకి తేవడంతో అనేకమంది దాతలు స్పందించారు.

AP Deputy CM: నటి పాకీజాకు పవన్‌ ఆపన్నహస్తం

  • రూ.2 లక్షల సాయం అందించిన డిప్యూటీ సీఎం

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): సినీ నటి వాసుకి(పాకీజా) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆమెకు ఆప్తహస్తం అందించారు. ‘పాపం పాకీజా’ శీర్షికన రెండ్రోజుల క్రితం ఆమె దీనస్థితిని వెలుగులోకి తేవడంతో అనేకమంది దాతలు స్పందించారు. ఈ కోవలోనే డిప్యూటీ సీఎం పవన్‌ స్పందించి ఆమెకు కబురు పెట్టారు. మంగళగిరిలోని జనసేన క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన ఆమెకు ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్‌, పి.గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్‌, చీర, స్వీటు బాక్సు అందించారు. పవన్‌ చేసిన సాయానికి నటి వాసుకి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానని, ఆయన కుటుంబానికి జీవితాతం రుణపడి ఉంటానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Updated Date - Jul 02 , 2025 | 07:38 AM