Pawan Kalyan Exclusive: ఫస్ట్ టైం ఇలా చేస్తున్నా.. రోజుకు రెండు గంటలు మాత్రమే..
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:55 PM
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ ABNతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాకు సంబంధించిన విషయాల గురించి ABNతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. కోహినూరు వజ్రం కోసం జరిగే ఒక వినూత్న మైన కధతో హరిహరవీరమల్లు నిర్మించినట్లు తెలిపారు. ఈ సినిమా మన మచిలీపట్నంలో ప్రారంభమై హైదరాబాద్, ఢిల్లీ వరకు కధ చేరుతుందన్నారు. తొలిసారిగా చారిత్రాత్మక చిత్రం చేస్తున్నట్లు వెల్లడించారు. చాలా సందర్భాల్లో రెమ్యూనేషన్ కోల్పయాను.. డబ్బు అవసరమే... కానీ డబ్బే ప్రాధాన్యం కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.. తాను ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పారు.
చిన్నపాటి యుద్దమే..
ఒక సినిమా పూర్తి చేయాలంటే అందరినీ మెప్పించడానికి ఒక చిన్నపాటి యుద్దమే చేయాలని, నిర్మాత... ఒక సినిమా పూర్తి చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో తనకు తెలుసన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చేశామని, సినిమా మంచిగా ఉంటే ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఎవరూ ఆపలేరని, గతంలో భీమ్లానాయక్ సినిమాతో ఇది రుజువైయిందని స్పష్టం చేశారు.
నా సినిమా అయినా సరే..
నా సినిమా అయినా టిక్కెట్ రేట్ల అంశంకు సంబంధించిన ఫైల్‌ను సీఎం చంద్రబాబు వద్దకు పంపానని, ఆయనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అందుకు ఆయనకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తాను చేసే సినిమాలు గతంలో ఇచ్చిన కమిట్‌మెంట్‌తో ఉన్నవే అని, ఆలస్యం అయినందుకు నిర్మాత లను క్షమించమని అడిగినట్లు చెప్పారు.
కేవలం రెండు గంటలు మాత్రమే
డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆ సినిమాలు పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్నట్లు వివరించారు. ప్రజా జీవితంలో ఖాళీ లేకుండా డిప్యూటీ సీఎంగా పని చేస్తున్నానని, రోజుకు రెండు గంటల పాటు మాత్రమే షూటింగ్‌కు అనుమతి ఇచ్చారని, దర్శక నిర్మాతలు కూడా నా ఇబ్బందులు గుర్తించి సహకరించారని కీలక విషయాలు తెలిపారు. ఒక మంచి సినిమా ప్రజలకు అందిస్తున్నామనే నమ్మకం తమకు ఉందన్నారు.
మంచి కథ వస్తే నిర్మాతగా ..
OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో నటనకు ప్రస్తుతం స్వస్తి పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. మంచి కథ వస్తే నిర్మాతగా వ్యవహరిస్తానన్నారు. AM రత్నంకు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వమని సీఎంను కోరానని, త్వరలో ఇస్తారు అని కూడా క్లారిటీ ఇచ్చారు.
Also Read:
మధ్యప్రదేశ్ మహా దర్శన్.. శివభక్తుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ
ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..